కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించవచ్చు: కలెక్టర్

E.G: ఏపీ అమరావతి ఓపెన్ స్కూల్ ద్వారా జారీ చేసిన ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని కలెక్టర్ పి. ప్రశాంతి కొవ్వూరుకు చెందిన లావణ్యకు సోమవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, దానికి లావణ్య వంటి వారు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 500కు 345 మార్కులు సాధించిందన్నారు.