ఉప్పల్‌లో దళితులకు వరంగా రాజీవ్ కళ్యాణ మండపం..!

మేడ్చల్: ఉప్పల్ పరిధి దళితులకు రాజీవ్ కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లుగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. హరిజన బస్తీలో రూ.కోటి 27 లక్షలతో రాజీవ్ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప్పల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, అన్ని సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామన్నారు.