మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: రోడ్డు ప్రమాద బాధిత వృద్ధురాలిని తన వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించి వేగంగా వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకొని ఎమ్మెల్యే రాము శుక్రవారం మానవత్వం చాటుకున్నారు. గుడివాడ మండలం బొమ్ములూరులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో వాహనంపై ఉన్న అచ్చమ్మ అనే వృద్ధురాలు కింద పడిపోయి, గాయాలతో బాధపడుతుంది. వృద్ధురాలు పరిస్థితిని చూసి ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రికి తరలించారు.