VIDEO: బయో ప్రొడక్ట్స్ మందులను సీజ్ చేసిన అధికారులు

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆకులవారి ఘణపురంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 6 లక్షల విలువగల బయో ప్రొడక్ట్స్ మందులను వ్యవసాయశాఖ అధికారులు సీజ్ చేశారు. రావురి వెంకటేశ్వరరావు అనే వ్యాపారిపై వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.