TGRJC CET-2026కు చివరి రోజు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంటర్ MPC, BiPC గ్రూపుల్లో చేరేందుకు TGRJC CET-2026కు దరఖాస్తు చేయాలని అధికారులు తెలిపారు. నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల 10వ తరగతి విద్యార్థులు వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. మే 3న పరీక్ష జరగనుండగా, దరఖాస్తుకు నేడు చివరి రోజు కావడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.