ఐరన్ కంపెనీ కార్మికుడు మృతి

TPT: ఏర్పేడు మండలంలోని మేర్లపాక సమీపంలో ఉన్న పుష్పిత్ కంపెనీలో పనిచేస్తున్న మేర్లపాక నివాసి మహేష్(45) అనే వ్యక్తి డ్యూటీ లోనే సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. కర్మాగారంలో మెకానిక్‌గా పని చేసే ఇతను అలసటతో సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు వెంటనే రేణిగుంట సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.