'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి'

BDK: కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం ఓప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.