NDRF బృందాలు ఉమ్మడి జిల్లాలో ఇక్కడే.!

NDRF బృందాలు ఉమ్మడి జిల్లాలో ఇక్కడే.!

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం ఇన్, ఔట్ ఫ్లో 4.66 లక్షల క్యూసెక్కులు నమోదైందని అధికారులు తెలిపారు. రేపటికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. అత్యవసర సహాయక చర్యల కోసం కృష్ణా జిల్లా అవనిగడ్డ, NTR జిల్లా విజయవాడ, కృష్ణా ఘాట్‌లలో NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.