యూరియా పంపిణీ ప్రక్రియపై అధికారులతో సమీక్ష

MHBD: నియోజకవర్గంలో యూరియా పంపిణీ, కొరత సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ వ్యవసాయశాఖ అధికారులతో ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో యూరియా పంపిణీ కార్యక్రమం సక్రమంగా, పకడ్బందీగా జరిగేందుకు పలు సూచనలు చేసి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తక్షణమే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.