'రోడ్డు భద్రతా చర్యలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

'రోడ్డు భద్రతా చర్యలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

ATP: రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని ఎస్పీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.