'విశాఖ రైల్వే జోన్ ప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతోంది'
విశాఖపట్నం: జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ఏర్పాటుకు సంబంధించి నిధుల కేటాయింపు, భూసేకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.