VIDEO: సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ చూశారా?
ATP: యాడికి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాఫ్టర్ ల్యాండింగ్‌ను స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న జనం, గాల్లో చక్కర్లు కొడుతూ హెలికాఫ్టర్ కిందకు దిగుతున్న దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ముఖ్యమంత్రి రాకతో యాడికి పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.