BREAKING: 'కాశిబుగ్గ దసరా వేడుకలు రద్దు'

BREAKING: 'కాశిబుగ్గ దసరా వేడుకలు రద్దు'

WGL: వరంగల్ కాశిబుగ్గలో ఏటా ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం రద్దయ్యాయి. ఈ మేరకు కాశిబుగ్గ దసరా ఉత్సవ కమిటీ మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. 37 ఏళ్లుగా నిర్విరామంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం వేడుకలకు స్థలం దొరకపోవడంతో రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఈ నెల 12వ తేదీ అనంతరం ఆదాయ వ్యయాలతో కూడిన పూర్తి నివేదిక అందజేస్తామని చెప్పింది.