వరద బాధిత రైతులను ఆదుకోవాలి: వైసీపీ

GNTR: పెదకాకాని మండలంలో వరదల కారణంగా ముంపునకు గురైన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి గురువారం డిమాండ్ చేశారు. కొండవీటి వాగు దారి మళ్లింపు వల్లే పంటలు మునిగిపోయాయని బీసీ నాయకుడు తాడిబోయిన వేణు ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు.