రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

VZM: కొత్తవలస మండలం చీపురువలసకు చెందిన రంధి వేణు (21) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా బైక్ అదుపు తప్పి రైయిలింగ్ పై పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో అండగా ఉంటాడన్న కొడుకు అందని లోకాలకు చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మంగళవారం తెలిపారు.