సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: SP
SRD: పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం కాని సమస్యలపై నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ పరితోష్ పంకజ్ ఇవాళ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.