VIDEO: దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు
KMR: భిక్కనూర్ మండల కేంద్రంలో ఒంటరిగా ఉంటున్న ఉప్పరి లచ్చవ్వ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు గజ్జ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధురాలిపై దాడి చేసి బంగారు పూస్తెల తాడు దోచుకెళ్లిన నిందితుడిని, పోలీసులు ఫిర్యాదు అందిన కేవలం 3 గంటల్లోనే చర్చి గేట్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడి నుండి 40 గ్రాముల బంగారం, ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.