'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'
VZM: వేపాడ మండలంలోని సచివాలయాల సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ కోరారు. శనివారం వేపాడ, వల్లంపూడి, సోంపురం, వీలుపర్తి సచివాలయాలను ఎంపీడీవో సీహెచ్ సూర్యనారాయణతో కలసి సందర్శించారు. సచివాలయాల రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక, మూమెంట్, గ్రీవెన్స్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.