సత్యదేవుని ఆర్జిత సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే..!
KKD: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అందించే అన్ని ఆర్జిత సేవలు భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వీర్ల సుబ్బారావు తెలిపారు. సేవలను పొంద గోరే వారు aptemples.org వెబ్‌సైట్ లోను, 'మనమిత్ర' వాట్సాప్ నెంబర్ 9552300009లో టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.