VIDEO: 'పత్తి కొనుగోళ్లలో దళారుల ఆధిపత్యాన్ని అరికట్టాలి'
GNTR: పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం పెరిగి, ఇ-క్రాప్‌లో బినామీ అవకతవకల వల్ల రైతులు నష్టపోతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. అజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం గుంటూరు బ్రాడీపేట కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.