ఆ అవశేషాలు.. బందీలవి కావు: ఇజ్రాయెల్

ఆ అవశేషాలు.. బందీలవి కావు: ఇజ్రాయెల్

కాల్పుల విరమణ ఒప్పందంలో ఉద్రిక్తత పెరిగింది. హమాస్ సంస్థ రెడ్‌క్రాస్ ద్వారా అప్పగించిన ముగ్గురు బందీల అవశేషాలు తమ వారివి కావని ఇజ్రాయెల్ నిర్ధారించింది. గాజాలో దాడులు, అవశేషాల తారుమారు వ్యవహారాలు శాంతి ఒప్పందానికి పెను సవాల్‌గా మారాయి. మృతదేహాల అప్పగింతకు ముందు నమూనాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా.. ఇజ్రాయెల్ నిరాకరించిందని హమాస్ ప్రకటించింది.