నేడు సాయంత్రం 5 గంటలతో ప్రచారం క్లోజ్

నేడు సాయంత్రం 5 గంటలతో ప్రచారం క్లోజ్

JN: జిల్లాలో 3వ విడతలో ఈ నెల 17న జరగనున్న గ్రామ పంచాయతీ పోలింగ్ నేపథ్యంలో నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల నుండి 17వ తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రచార కార్యకలాపాలన్ని నిషేధం అన్నారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, సోషల్ మీడియా ప్రచారాలు నిషేధితమన్నారు.