ఎస్సై శ్రీకాంత్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ

ఎస్సై శ్రీకాంత్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ

NRML: గత వర్షాకాలంలో 100 డయల్‌కు స్పందించి నిండు ప్రాణాలు కాపాడిన ఎస్సై శ్రీకాంత్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రియల్ హీరోస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల అవార్డు గ్రహీతను ఏఎస్పి బైంసా కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. మంచి పనులు చేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని ఎస్పీ తెలిపారు.