సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

SRCL: వేములవాడ గ్రామీణ మండలంలోని బొల్లారం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంజూరైన రూ.5 లక్షల నిధులతో శనివారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.