సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్లోడ్ తప్పనిసరి

SKLM: సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీం హెచ్ సీ వై నారాయణ రావు తెలిపారు. శనివారం నరసన్నపేట కాలేజీ రోడ్డులో విద్యార్థినిలకు శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ శక్తి యాప్ ఉంటే ఒక పోలీస్ మీ వెంట ఉన్నట్లేనని తెలియజేశారు. ఆపద సమయంలో, అత్యవసర సమయాలలో ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు.