శ్రావణమాసోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

HNK: 1000 స్తంభాల దేవాలయంలో సోమవారం రాత్రి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, శ్రావణ మాసోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఆలయంలో మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప శ్రావణ మాస వేడుకల ఆహ్వాన పత్రికలను భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు