రేపు వెయ్యి మట్టి విగ్రహాల పంపిణీ

NLG: పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యతనిస్తూ చండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ మల్లేష్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రజల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వెయ్యి మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.