'నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది'

'నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది'

KMM: నేలకొండపల్లి మండలంలో ఇటీవల వచ్చిన మోంథా తుపాను కారణంగా రైతులు పండించిన వరి పంట పడిపోయి పూర్తిగా దెబ్బతింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా కోసం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు శుక్రవారం పరిశీలించారు.