గులాబీ బాస్ కేసీఆర్ స్పీచ్ పైనే

WGL: ఎలకుర్తిలో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారనే ఆసక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కావడమే దీనికి ప్రధాన కారణం. అదే సమయంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గులాబీ బాస్ ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేస్తారనే చర్చ జరుగుతోంది.