ఆలయం కోసం ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

ఆలయం కోసం ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

CTR: కుప్పం (M) టి. సదమూరు శ్రీకదిరి నరసింహ స్వామి ఆలయానికి విద్యుత్ సౌకర్యం కోసం రెస్కో నూతనంగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసింది. ఏటా ఆలయంలో 11 రోజులపాటు జాతరను నిర్వహిస్తారు. ఆలయం వద్ద విద్యుత్ సమస్య కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు రెస్కో డైరెక్టర్ హరోహరన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు రూ.3.5 లక్షల వ్యయంతో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు.