పత్తి పంటలో తగ్గిన దిగుబడి

GDWL: ధరూర్ మండలంలోని రైతాంగం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పత్తి పంటను అత్యధికంగా సాగు చేశారు. కానీ ఆశించినంత పంట దిగుబడి వచ్చేటట్టు కనిపించడం లేదని రైతులు తెలియజేశారు. ఈ సంవత్సరం పత్తి పంటలకు తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గిందన్నారు. మరోవైపు విత్తన పత్తి పంటల్లో కూడా తెగుళ్ల వ్యాప్తి, అధిక వర్షపాతం వంటివి పంటలపై ప్రభావం చూపాయని అన్నారు.