రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు మండలం వణుకూరు నుంచి మద్దూరు గ్రామం వరకు రూ.7 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న రహదారికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వమని అన్నారు. గోశాల, వలకూరు, మద్దూరు గ్రామాల ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టామని తెలిపారు.