బరువు తగ్గించే ఔషధాల ప్రచారంపై నిషేధం
బరువు తగ్గించే ఔషధాల వినియోగ ప్రచారంపై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల GLP-1 ఆధారిత బరువు తగ్గించే జెనరిక్ రకాల ఔషధాలు దేశంలోకి ప్రవేశించాయి. రిటైల్ ఫార్మసీలు, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారమ్‌లు, టోకు వ్యాపారులు, వెల్‌నెస్ క్లినిక్‌ల ద్వారా సులభంగా లభించడంపై ఆందోళన నెలకొంది. దీంతో అనధికారిక అమ్మకాలు, ప్రచారంపై డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది.