VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WGL: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం ఉదయం గీసుకొండ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ధర్మారం, పోతురాజుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.