అయిదుగురి విద్యార్థినులను కరచిన ఎలుక

అయిదుగురి విద్యార్థినులను కరచిన ఎలుక

SKLM: నరసన్నపేట తామరాపల్లి సమీప బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఎలుకలు కరవడంతో 5 గురు విద్యార్థినులు గాయపడ్డారు. కళాశాలలో వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో రాత్రివేళలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంటర్ విద్యార్థినులు నిద్రించే సమయంలో అవి కరవడంతో గాయపడ్డారు. వీరిని స్థానిక సీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలందించారు.