ఇకపై నేను సింగిలే: స్టార్ హీరోయిన్‌

ఇకపై నేను సింగిలే: స్టార్ హీరోయిన్‌

స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన ప్రేమ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో శాంతను హజారికాతో ప్రేమలో ఉన్న ఈ భామ, ఇటీవల అతనితో విడిపోయినట్లు స్పష్టం చేసింది. తాను ఇప్పటివరకు ఆరు సార్లు ప్రేమలో పడ్డానని, ప్రతిసారీ ఆ బంధాలు చేదు అనుభవాలనే మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం నటనపైనే ఉందని, ఇకపై సింగిల్‌గానే ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించింది.