పాఠశాల ఇలా.. చదువులు సాగేది ఎలా..?

NRPT: మరికల్ మండలంలోని పసుపుల ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాఠశాలలో ఇటీవల కాంపౌండ్ వాల్ నిర్మించడంతో వర్షం నీరు బయటకి వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. నడుము లోతు నీళ్లలో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లి పాటలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి విద్యార్థుల బాధలు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.