బాహుబలి బ్రిడ్జిపై బోల్తా పడ్డ వాహనం

బాహుబలి బ్రిడ్జిపై బోల్తా పడ్డ వాహనం

GNTR: అమరావతి ప్రాంతంలోని బాహుబలి బ్రిడ్జిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటపాలెం నుంచి విజయవాడ వైపు ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళ్తున్న అశోక్ లేల్యాండ్ వాహనం టైర్ బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.