'క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్ఠిగా కృషి చేద్దాం'
KDP: సమష్ఠి కృషితోనే క్షయ వ్యాధిని నిర్మూలించవచ్చని భారతి సిమెంట్ చీఫ్ మేనేజర్ పి. భార్గవ్ రెడ్డి అన్నారు. భారతి సిమెంట్ సీఎస్ఆర్ సహకారంతో పెయిడ్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల (M) తిప్పలూరు ఎంపీపీ పాఠశాలలో 100 రోజుల క్షయ వ్యాధి నిర్మూలన ప్రచారంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల వైద్యాధికారులు శ్రీనాథ్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.