ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

కడప ఆర్టీసీ బస్టాండ్‌లో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చిన్నచౌక్ పోలీసులు నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా అనుమానిత ప్రయాణికుల బ్యాగులు, పరిసరాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానాస్పద వస్తువులు, కదలికలు కనిపిస్తే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని CI ఓబులేసు ప్రజలకు సూచించారు.