చల్లపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమైక్యతా ర్యాలీ

చల్లపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమైక్యతా ర్యాలీ

కృష్ణా: దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిది అని చల్లపల్లి సీఐ కే.ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం భారత మాజీ ఉప ప్రధాని, స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా చల్లపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమైక్యతా నడక నిర్వహించారు. దేశ సమైక్యతను ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పీఎస్‌వీ.సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది, గ్రామ పౌరులు పాల్గొన్నారు.