మూడో కాన్పులో నలుగురికి జన్మ!

మహారాష్ట్ర సాతారా జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. తొలి సంతానంలో ఇద్దరు కవలలు( ఓ బాలుడు, బాలిక) ఉండగా.. రెండో కాన్పులో ఓ ఆడ సంతానం కలిగింది. ఇప్పుడు మూడో కాన్పులో ముగ్గురు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి పుట్టినట్లు వైద్యులు తెలిపారు. వారి బరువు 1200గ్రా. నుంచి 1600 గ్రాములుగా ఉందని చెప్పారు. తక్కువ బరువు కారణంగా ప్రస్తుతం వారిని ICUలో ఉంచామన్నారు.