'మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

VZM: గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు చిత్తు చేసుకొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన, డిఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు.