హజ్‌యాత్రికులకు గుడ్ న్యూస్

NTR: హజ్‌యాత్ర –2025 సందర్భంగా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకున్న 72 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.72 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2026 హజ్ యాత్రికులు కూడా విజయవాడ కేంద్రం ఎంచుకుంటే ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఈనెల 7లోగా దరఖాస్తు చేసుకొని విజయవాడను ఎంచుకోవాలని సూచించారు.