నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
WGL: మడికొండలోని సుశీల్ గార్డెన్స్‌లో ఆదివారం తాండూరి అఖిల-దిలీప్‌ల వివాహ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.