ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
VZM: ఎల్.కోట మండలం ఖాసాపేటలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సతి సమేతంగా పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛారణ మధ్య అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.