VIDEO: 'వన్యప్రాణుల సంరక్షణకు అందరూ కృషి చేయాలి'
NRML: ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో వచ్చే 100 రోజుల పాటు వన్యప్రాణుల సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎఫ్డీవో శివకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఖానాపూర్ పట్టణంలో అటవీ శాఖ సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు.