బీజేపీ ధర్నా పేరుతో నాటకాలు చేయటం తగదు: భోజారెడ్డి
ADB: మూడుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు.