చైనాకు చెందిన స్పై బర్డ్ కలకలం!
కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో చైనాకు చెందిన స్పై బర్డ్ కలకలం రేపింది. కార్వార్ ఠాగూర్ బీచ్‌లో కదలలేని స్థితిలో సీగల్ పక్షిని స్థానికులు గుర్తించారు. ఈ పక్షి పైభాగంలో సోలార్ ప్యానెల్ అటాచ్ చేసి ఉన్న GPS ట్రాకర్ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ట్రాకర్‌లో చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ మెయిల్ ఐడి ఉండటంతో అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు.