'జీసీసీ డీఆర్ డిపో ద్వారా ఉత్పత్తులను విక్రయించాలి'

'జీసీసీ డీఆర్ డిపో ద్వారా ఉత్పత్తులను విక్రయించాలి'

PPM: అటవీ ఉత్పత్తులను జీసీసీ డీఆర్ డిపో ద్వారా విక్రయించుకోవాలని గిరిజనులకు పార్వతీపురం జీసీసీ డివిజనల్ మేనేజర్ రామారావు బుధవారం కోరారు. కొమరాడ మండలం పెద్దశాఖలో ఉన్న డిపో వద్ద గిరిజనులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పిస్తున్న ధరకు డీఆర్ డిపోలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.